నిషిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో ఇండియా విమెన్స్ జట్టు సెమీఫైనల్ మ్యాచ్‌కు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ పోరులో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌ను ఈజీగా ఓడించిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోంది. ఆసియా కప్‌లో బంగ్లాపై గెలిచిన ఇండియా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగిన చివరి తొమ్మిది మ్యాచ్‌ల్లో ఇండియానే గెలిచింది.
బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇండియా సూపర్ ఫామ్‌లో ఉంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి జపాన్ పిచ్‌లపై టర్న్, బౌన్స్‌ను బాగా ఉపయోగించుకుంటోంది. పార్ట్ టైమర్ షెఫాలీ వర్మ, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కూడా అం డగా నిలుస్తున్నారు. గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన శ్రేయాంక పాటిల్ మద్దతు కూడా ఉండ టం ఇండియాకు కలిసొచ్చే అంశం. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగితే భారీ స్కోరు ఖాయం. మరోవైపు బంగ్లాదేశ్‌లో నహిదా అక్తర్, రబేయా ఖాన్ కీలకం కానున్నారు. పిచ్ సహకరిస్తేనే ఇండియా బ్యాటింగ్‌ను కట్టడి చేసేందుకు బంగ్లాకు చాన్స్ ఉంటుంది.
