అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా, పృథ్వీ దండమూడి, వంశీ కీలక పాత్రలు పోషించారు. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది.
ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఝాన్సీ మాట్లాడుతూ ‘ఏడుగురు మహిళలు కలిసి చేసిన సినిమాగా పాత్‌బ్రేక్ మూవీ అవుతుంది. ఇందులో ప్రతి ఒక్కరికీ మెమొరబుల్ మూమెంట్ దొరికింది’ అని చెప్పారు. పేరెంట్స్, ఫ్యామిలీస్‌తో కలిసి చూడదగ్గ చిత్రమిది అని పాయల్ రాధాకృష్ణ చెప్పింది. డైరెక్టర్ అభిరామ్ మాట్లాడుతూ ‘సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను అమ్మాయిల నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ అబ్బాయిల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీస్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు’ అని అన్నాడు. తమ పాత్రలకు మంచి ఆదరణ దక్కడం ఆనందంగా ఉందని నటీనటులు వంశీ, సునైనా చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
