సమంత ప్లేస్ లో శ్రుతిహాసన్..ఇంటర్నేషనల్ మూవీకి ఒకే

సమంత  ప్లేస్ లో శ్రుతిహాసన్..ఇంటర్నేషనల్ మూవీకి  ఒకే

హీరోయిన్ శ్రుతిహాసన్‌‌‌‌‌‌‌‌ త్వరలో ఓ అంతర్జాతీయ చిత్రంలో నటించబోతోంది.  ‘ది అరేంజ్‌‌‌‌‌‌‌‌మెంట్స్ ఆఫ్ ల‌‌‌‌‌‌‌‌వ్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని రెండేళ్ల క్రితమే ప్రకటించారు.  బాఫ్టా అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి సమంత ఇందులో నటించాల్సి ఉంది. అయితే ఆమె మయోసైటిస్‌‌‌‌‌‌‌‌ కారణంగా బ్రేక్ తీసుకోవడంతో షూటింగ్ ఆలస్యమైంది. ‘మా ఇంటి బంగారం’ తర్వాత స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలనుకున్నప్పటికీ సమంత ప్రెగ్నెన్సీ కారణంగా మరోసారి సందిగ్ధంలో పడింది. దీంతో ఇప్పుడు ఆ స్థానంలో శ్రుతిహాసన్‌‌‌‌‌‌‌‌ను ఖరారు చేసినట్టు సమాచారం.

 ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ మూవీ కావడంతో పాటు తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్న ఇంపార్టెన్స్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకుని శ్రుతి అంగీకరించినట్టు తెలుస్తోంది. తిమోరి ఎన్ మురారి రాసిన న‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ల ఆధారంగా ఈ ఇండో– బ్రిటీష్‌‌‌‌‌‌‌‌ మూవీని ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. చెన్నైలో డిటెక్టివ్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ నడుపుతున్న బై సెక్సువల్‌‌‌‌‌‌‌‌ యువతిగా శ్రుతి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండబోతోంది.  త‌‌‌‌‌‌‌‌న తండ్రిని వెతుక్కుంటూ అమెరికా నుంచి ఇండియాకు వ‌‌‌‌‌‌‌‌చ్చిన యువకుడి కథ ఇది. వివేక్ కల్రా ఆ పాత్రను పోషిస్తున్నాడు. అతన్ని  పోలీసులు టెర్రరిస్ట్‌‌‌‌‌‌‌‌గా అనుమానిస్తుండగా  ఓ లేడీ డిటెక్టివ్‌‌‌‌‌‌‌‌ అతనికి హెల్ప్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది.  ఈ క్రమంలో అతనితో ప్రేమలో పడుతుంది. ఇంతకూ అతను తన తండ్రిని కలుసుకున్నాడా లేదా అనేది మిగతా కథ.  ఇక దుల్కర్ సినిమా ‘ఆకాశంలో ఒక తార’లో శ్రుతి కీలకపాత్ర పోషించగా,  నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20న ఇది విడుదల కాబోతోంది.