అమెరికా కొత్త టారిఫ్స్, ముదురుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధంతో బులియన్ మార్కెట్లు గందరగోళంలో ఉన్నాయి. ఒకపక్క పరిస్థితులు దిగజారుతున్నా ఇన్వెస్టర్లు ధైర్యం చేసి గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవటంతో పాటు ఇప్పటికే రిటైల్ ధరలు ఆకాశాన్ని తాకటంతో సామాన్యులు కూడా బంగారం, వెండి కొనుగోళ్లకు దూరంగానే ఉంటున్నారు. దీనికి తోడు ఇండియా దిగుమతి సుంకాల పెంపు మరింత భారంగా మారింది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రిటైల్ ఇన్వెస్టర్లు ముందుగా తమ నగరాల్లోని తగ్గిన ధరలను పరిశీలించటం ముఖ్యం.
జూలై 24న బంగారం రేట్లు తగ్గాయి. జూలై 23 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.185 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 433గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 230గా కొనసాగుతోంది.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 24, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 40వేలుగా అమ్మబడుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.240 దగ్గర ఉంది.
