విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం రణబాలి. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఈ పీరియాడికల్ డ్రామాను మొదట సెప్టెంబర్ 11న విడుదల చేయాలని భావించినా, ఇప్పుడు ఆ ప్లాన్లో మార్పులు వేసినట్లు తెలుస్తోంది.భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కీలకంగా ఉండటంతో వాటికి మరింత సమయం కేటాయించాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం.
తొందరపడి సినిమాను విడుదల చేయడంకంటే, ప్రతి ఆంశంలో అత్యుత్తమ నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే రిలీజు వాయిదా వేసే సన్నాహాలు చేస్తున్నారట. ముఖ్యంగా పండుగ సీజన్ లో ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలు స్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 16న లేదంటే దీపావళి సందర్భంగా సనంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం.
హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వొస్లు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై నవీస్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్యత్యన్ కాంబోలో 'ట్యాక్సీ వాలా' తర్వాత రాబోతున్న చిత్రమిది.
