30 న జూనిపర్ గ్రీన్ ఐపీఓ.. పూర్తిగా ఫ్రెష్‌‌ షేర్ల రూపంలో ఆఫర్‌‌‌‌ ఫర్ సేల్

30 న జూనిపర్ గ్రీన్ ఐపీఓ.. పూర్తిగా ఫ్రెష్‌‌ షేర్ల  రూపంలో ఆఫర్‌‌‌‌ ఫర్ సేల్

న్యూఢిల్లీ: రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ జూనిపర్ గ్రీన్ ఎనర్జీ రూ. 1,800 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌‌‌‌‌‌ (ఐపీఓ) ను ఈ నెల30న ప్రారంభమై, ఆగస్టు 3న ముగుస్తుంది.  యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జులై 29న మొదలవుతుంది. ఈ ఐపీఓ పూర్తిగా ఫ్రెష్‌‌ షేర్ల  రూపంలోనే ఉంటుంది. ఇందులో ఆఫర్‌‌‌‌ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌ఎస్‌‌)  లేదు. ఐపీఓ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 683.24 కోట్లు రుణాల చెల్లింపునకు ఉపయోగిస్తారు. అలాగే రూ. 728.69 కోట్లను తమ అనుబంధ సంస్థల్లో (జూనిపర్ గ్రీన్ గామా వన్, కైట్, పవర్ ఫైవ్) పెట్టుబడిగా పెట్టి వాటి బకాయిలను తీరుస్తారు. 

మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వాడనున్నారు. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ సోలార్, విండ్, హైబ్రిడ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులను నిర్మించి నిర్వహిస్తోంది. సింగపూర్ బేస్డ్ ఏటీ క్యాపిటల్ గ్రూప్ మద్దతు ఉన్న ఈ కంపెనీ షేర్లు బీఎస్‌‌ఈ, ఎన్‌‌ఎస్‌‌ఈలలో లిస్ట్ కానున్నాయి. ఈ ఇష్యూకి ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్‌‌ఎస్‌‌బీసీ, జేఎమ్ ఫైనాన్షియల్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.