ఆసియా గేమ్స్ లో ఇండియా నేరుగా క్వార్టర్‌‌ఫైనల్‌‌ కు

ఆసియా గేమ్స్ లో ఇండియా నేరుగా క్వార్టర్‌‌ఫైనల్‌‌ కు

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే ఇండియా క్రికెట్ల జట్లకు గుడ్‌‌ న్యూస్‌‌. మెన్స్‌‌, విమెన్స్‌‌ విభాగాల్లో ఇండియా డైరెక్ట్‌‌గా క్వార్టర్‌‌ఫైనల్లోనే తలపడనుంది. ఈ మేరకు శుక్రవారం డ్రా విడుదల చేశారు. పాకిస్తాన్‌‌ కూడా నేరుగా క్వార్టర్స్‌‌లోనే బరిలోకి దిగనుంది. జపాన్‌‌లో ఐచీలో సెప్టెంబర్‌‌ 17 నుంచి 22 వరకు విమెన్స్‌‌ టోర్నీ, సెప్టెంబర్‌‌ 24 నుంచి అక్టోబర్ 1 వరకు మెన్స్‌‌ టోర్నీ జరగనుంది. హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ సారథ్యంలోని టీమిండియా.. క్వార్టర్స్‌‌లో జపాన్‌‌తో తలపడుతుంది. 

ఇందులో గెలిస్తే సెమీస్‌‌లో బంగ్లాదేశ్‌‌ లేదా చైనాతో అమీతుమీ తేల్చుకుంటుంది. ఫైనల్లో పాక్‌‌తో ఆడే చాన్స్‌‌ ఉంది. మెన్స్‌‌లో తొలి రౌండ్‌‌ పోటీలు పూర్తయిన తర్వాత క్వార్టర్స్‌‌ ప్రత్యర్థి ఖరారు అవుతుంది. 

అన్ని అనుకున్నట్లుగా జరిగితే సెమీస్‌‌లో ఇండియా.. పాకిస్తాన్‌‌తో తలపడొచ్చు. మెన్స్‌‌లో 10 జట్లు బరిలో ఉన్నాయి. గ్రూప్‌‌–ఎలో అఫ్గానిస్తాన్‌‌, జపాన్‌‌, నేపాల్‌‌, గ్రూప్‌‌–బిలో హాంకాంగ్‌‌, చైనా, మలేసియా, ఒమన్‌‌ పాల్గొంటున్నాయి.