మీడియేషన్‌‌‌‌ ఆప్షన్‌‌‌‌పరిశీలించండి..రైస్‌‌‌‌మిల్లర్ల కేసులో గవర్నమెంట్‌‌‌‌కు హైకోర్టు సూచన

మీడియేషన్‌‌‌‌ ఆప్షన్‌‌‌‌పరిశీలించండి..రైస్‌‌‌‌మిల్లర్ల కేసులో గవర్నమెంట్‌‌‌‌కు హైకోర్టు సూచన

హైదరాబాద్, వెలుగు:  యాసంగి ధాన్యం (2022-–23)పేమెంట్‌‌‌‌పై రైస్‌‌‌‌మిల్లర్లు, గవర్నమెంట్‌‌‌‌ మధ్య ఉన్న వివాదాన్ని మీడియేషన్‌‌‌‌ ద్వారా పరిష్కరించే అవకాశాన్ని పరిశీలించాలని హైకోర్టు సూచించింది. దీనివల్ల ప్రొసీడింగ్స్, లీగల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పెన్సెస్‌‌‌‌ తగ్గుతాయని అభిప్రాయపడింది.

ప్రభుత్వం డిసిషన్ తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. జీవో-7తో పాటు, క్వింటాలుకు రూ.2,236.81 చెల్లించాలంటూ జారీ చేసిన డిమాండ్‌‌‌‌ నోటీసులను సవాల్‌‌‌‌ చేస్తూ రైస్‌‌‌‌మిల్లర్లు వేసిన 115 పిటిషన్లపై జస్టిస్‌‌‌‌ నగేశ్‌‌‌‌ భీమపాక విచారణ చేపట్టారు.సుదీర్ఘ లిటిగేషన్‌‌‌‌ కంటే మీడియేషన్‌‌‌‌ బెటర్ కోర్టు అభిప్రాయపడింది.