ఐఎస్‌‌ఎస్‌‌ఎఫ్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో సైన్యంకు సిల్వర్‌‌‌‌

ఐఎస్‌‌ఎస్‌‌ఎఫ్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో సైన్యంకు సిల్వర్‌‌‌‌

హాంగ్‌‌జౌ: ఇండియా షూటర్‌‌ సైన్యం.. ఐఎస్‌‌ఎస్‌‌ఎఫ్‌‌ రైఫిల్‌‌ / పిస్టల్‌‌/ షాట్‌‌గన్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో సిల్వర్‌‌ మెడల్‌‌తో మెరిసింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌ పిస్టల్‌‌ ఫైనల్లో సైన్యం 243.4 పాయింట్లు సాధించి రెండో ప్లేస్‌‌లో నిలిచింది. మరో షూటర్‌‌ సురుచి ఇందర్‌‌ సింగ్‌‌ 137.6 పాయింట్లతో ఏడో ప్లేస్‌‌లో నిలిచింది. 

క్వాలిఫయింగ్‌‌లో సైన్యం 579, సురుచి 579–20 ఎక్స్‌‌ పాయింట్లతో ఫైనల్‌‌కు అర్హత సాధించారు. స్టార్‌‌ షూటర్‌‌ మాను భాకర్‌‌ (582–12 ఎక్స్‌‌), ఇషా సింగ్‌‌ (577–22 ఎక్స్‌‌), లక్షిత (572–14 ఎక్స్‌‌) నిరాశపర్చారు.