T 20 World CUP: సౌతాఫ్రికా స్కోర్ 187.. బాగా కంట్రోల్ చేసిన ఆఫ్గనిస్తాన్ బౌలర్లు

T 20 World CUP: సౌతాఫ్రికా స్కోర్ 187.. బాగా కంట్రోల్ చేసిన ఆఫ్గనిస్తాన్ బౌలర్లు

టీ 20 వరల్డ్ కప్ మ్యాచుల్లో భాగంగా.. 2026, ఫిబ్రవరి 11వ తేదీ గ్రూప్ Dలో ఉన్న సౌతాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ జట్టు మొదట బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్‎కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లు ఆడి.. ఆరు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.

ఓపెనర్‏గా దిగిన కెప్టెన్ మార్కరం ఐదు పరుగులకే ఔట్ అయ్యాడు. స్టార్టింగ్‎లోనే డిఫెన్స్ లో పడిన సౌతాఫ్రికా జట్టు.. మరో వికెట్ కోల్పోకుండా డిఫెన్స్ ఆడింది. మరో ఓపెనర్, వికెట్ కీపర్ డికాక్ 41 బంతుల్లో 59 పరుగులు చేయగా.. థర్డ్ డౌన్ లో వచ్చిన రిక్లెటన్ 28 బాల్స్ ఆడి 61 పరుగులు చేశాడు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్ లతో చెలరేగాడు రిక్లెటన్. దీంతో స్కోర్ బోర్డ్ పరుగులు తీసింది. 

ALSO READ : విన్నింగ్ జోష్‎లో ఉన్న న్యూజిలాండ్‎కు ఇది బ్యాడ్ న్యూసే

వీళ్లిద్దరూ ఔట్ అయిన తర్వాత గ్రౌండ్ లోకి దిగిన బ్రీవిస్ 19 బాల్స్ ఆడి 23 పరుగులు చేయగా.. మిల్లర్ 15 బంతుల్లో 20 రన్స్ చేశాడు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన జన్సన్ 7 బాల్స్ ఆడి 16 రన్స్ చేయటంతో.. ఆరు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది సౌతాఫ్రికా టీం. 

ఆఫ్గనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఓమర్జాయ్ మూడు వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్లు వేసిన అజ్ముతుల్లా జస్ట్ 41 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడు కీలకమైన వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా దూకుడును కట్టడి చేశాడు. 

మరో బౌలర్ రషీద్ ఖాన్ నాలుగు ఓవర్లు వేసి 28 రన్స్ మాత్రమే ఇచ్చి.. 2 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో.. సౌతాఫ్రికా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. మరో బౌలర్ ఫరూఖీ నాలుగు ఓవర్లు వేసి 32 రన్స్ ఇచ్చి.. ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. 

ఆఫ్గనిస్తాన్ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్ తో.. సౌతాఫ్రికా 200 పరుగులు కూడా చేయలేకపోయింది.
187 పరుగుల టార్గెట్ ను ఆఫ్గనిస్తాన్ ఛేజ్ చేస్తుందా లేదా అనేది చూడాలి.