45 రోజులకోసారి మండల పరిషత్ సమావేశాలు

45 రోజులకోసారి మండల పరిషత్ సమావేశాలు

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతోపాటు స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి మండలంలో 45 రోజులకోసారి తప్పనిసరిగా మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) సమావేశాలు నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం మండల పరిషత్‌లలో పాలన చూస్తున్న ప్రత్యేకాధికారులు క్రమం తప్పకుండా ఈ సమావేశాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ భేటీల్లో గ్రామ పంచాయతీ సర్పంచులు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమావేశంలో సమీక్షించనున్నారు.