సీజేపీ నిరసనలు.. బిట్ చాట్ యాప్ ను బ్లాక్ చేయమని కేంద్ర ఆదేశం..నోటీసు లీక్ చేసిన జాక్ డోర్సీ

సీజేపీ నిరసనలు.. బిట్ చాట్ యాప్ ను బ్లాక్ చేయమని కేంద్ర ఆదేశం..నోటీసు లీక్ చేసిన జాక్ డోర్సీ

ఢిల్లీ నిరసనల క్రమంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఢిల్లీ జంతర్​మంతర్​ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన కేంద్ర  ప్రభుత్వం.. తాజాగా బ్లూటూత్​ యాప్​ అయిన బిట్ చాట్ ను బ్లాక్​ చేయాలని గిట్ హబ్ సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. తనకు అందిన నోటీసును  గిట్​ హబ్ సీఈవో జాక్​డోర్సీ లీక్​ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

BitChat యాప్​ ఇంటర్నెట్​ అవసరం లేకుండా  బ్లూటూత్ ద్వారా మెసేజ్​ లను షేర్​ చేసుకునే వాట్సాప్​ లాంటి యాప్..ఇది ప్రారంభమైన తక్కువ కాలంలో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది.దీనిని చాలా మంది వాడుతున్నారు. అయితే ఇపుడు ఈ యాప్​ ను మన దేశంలో నిషేధించింది.  భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే తొలగించాలని  దాని మాతృసంస్థ గిట్​ హబ్​ కు గురువారం (జూలై 23) కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.  

బ్లూటూత్ ద్వారా పనిచేసే  మెసేజింగ్ యాప్​బిట్‌చాట్‌ను తొలగించాలని మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థ గిట్‌హబ్‌ను ఆదేశిస్తూ హోం మంత్రిత్వ శాఖ  ఓ నోటీసు పంపింది.  ఈ విషయంపై బిట్​చాట్​ యాప్​ డెవలపర్​ జాక్​ డోర్సీ  శుక్రవారం(జూలై24) Xలో ఓ పోస్ట్ షేర్​ చేశారు. భారత ప్రభుత్వానికి బిట్‌చాట్ వంటి టెక్నాలజీలు నచ్చవు. అందుకే దానిని తొలగించాలని కోరుకుంటుంది అని జాక్ డోర్సీ హోంశాట ఇచ్చిన నోటీసు కాపీని షేర్​ చేశారు. 

అయితే ఇలాంటి యాప్‌లను మిస్​ యూజ్​ చేసే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థలకు దూరంగా పనిచేసే ఇటువంటి యాప్​ లతో నేరస్థులు ,సైబర్ మోసగాళ్లు తమ సమాచారాన్ని షేర్​ చేయడం ద్వారా అసాంఘిక, విధ్వంస కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బిట్‌చాట్‌ ను గిట్‌హబ్ నుంచి తొలగించాలని కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. 

బిట్‌చాట్ అంటే..

ఇది  ఇంటర్నెట్ అవసరం లేకుండా బ్లూటూత్ ద్వారా సమీపంలోని డివైజ్​ల మధ్య సమాచారం షేర్​ చేసుకునే  మెసేజింగ్ అప్లికేషన్. మొబైల్ నెట్‌వర్క్ ,వై-ఫై అందుబాటులో లేకపోయినా ఇది పనిచేయగల సామర్థ్యం కలిగి ఉన్నది.  దీనిలో ఎలాంటి ఫోన్ నంబర్లు, రిజిస్ట్రేషన్ ,వ్యక్తిగత వివరాలు అవసరం లేదు. ప్రైవేట్ మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. దీంతో చాలా మంది  వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది.

గిట్‌హబ్.. ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు తమ సాఫ్ట్‌వేర్ కోడ్‌ను స్టోర్​ చేసేందుకు,  డెవలప్​ చేసేందుకు ఉపయోగించే ఓ ప్లాట్​ ఫాం. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఈ ప్లాట్‌ఫాంలో లక్షలాది ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచి చట్టపరమైన అభ్యర్థనలు వచ్చినప్పుడు, వాటిని సంబంధిత నిబంధనల ప్రకారం గిట్‌హబ్ పరిశీలిస్తుంది.

డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొత్త కమ్యూనికేషన్ యాప్‌లు వినియోగదారులకు సౌలభ్యం కల్పిస్తున్నప్పటికీ, వాటి దుర్వినియోగాన్ని అరికట్టడం కూడా అంతే ముఖ్యమని టెక్​ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాలను నియంత్రించడం, దేశ భద్రతను పరిరక్షించడం, డిజిటల్ ప్లాట్​ ఫాం దుర్వినియోగాన్ని నివారించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని అధికారులు చెబుతున్నారు.