రెండు రోజులుగా దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఎలాంటి ర్యాలీ లేకుండా ప్రజలకు ఊరటను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం రేట్లు స్వల్పంగా తగ్గుతుండగా.. వెండి మాత్రం స్థిరంగా రేట్ల మార్పులు లేకుండా ఉండటం అటు వ్యాపారులకు ఇటు వినియోగదారులకు ఆనందాన్ని కలిగిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావటం వల్ల ఆభరణాలు షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది మంచి ఉపశమనాన్ని అందిస్తోంది.
ఫిబ్రవరి 11న బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. దీంతో ఫిబ్రవరి 10 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.27 తగ్గింపును నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా పెరిగి రూ.15వేల 851గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 530గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : సేల్స్‌ఫోర్స్ భారీ లేఆఫ్స్
అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొన్ని రోజుల కిందటి వరకూ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం ఫిబ్రవరి 11, 2025న వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాల్లో. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.300 వద్ద ఉంది.
