హైదరాబాద్ పరిధిలో ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్ ఎంసీ అధికారులు నడుం బిగించారు. తాజాగా ఈ రోజు ( జులై 2) పాతబస్తీలో ని మదీనా క్రాస్ రోడ్ నుండి పురానా పుల్ వద్ద ఫుట్ పాత్‌పై ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించారు. . ప్రధాన రహదారిపై ఉన్న ఫుట్ పాత్ ప్రాంతాన్ని చిన్న దుకాణాలు, షాపుల యజమానులు ఆక్రమించుకున్నారు. ఈరోజు ( జులై 2) తెల్లవారుజామున జీహెచ్‌ఎంసీ అధికారులు జేసీబీ, పోలీసు సిబ్బందితో మదీనా క్రాస్ రోడ్‌కు వచ్చి అక్రమ ఆక్రమణలను తొలగించారు.
