శ్రావణమాసంలో పుట్టినవారు నిజంగా అదృష్టవంతులా..! వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే..!

శ్రావణమాసంలో పుట్టినవారు నిజంగా అదృష్టవంతులా..! వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే..!

హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో శ్రావణమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పూజలు, వ్రతాలు, పండుగలు ఎక్కువగా జరుపుకుంటారు కాబట్టి శ్రావణమాసాన్ని పూజల మాసం, శుభాల మాసం, పండగల మాసం అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో శ్రావణమాసం వచ్చిందని చెబుతారు పండితులు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న శ్రావణమాసంలో పుట్టినవారు అదృష్టవంతులని అంటూ ఉంటారు చాలామంది. మరి, ఈ మాసంలో పుట్టినవారు నిజంగానే అదృష్టవంతులా...? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది..? పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

వాస్తవానికి పుట్టిన మాసాన్ని, తేదీని బట్టి అదృష్టం ఉండదని అంటున్నారు పండితులు. శ్రావణమాసంలో పుట్టినంత మాత్రాన అదృష్టవంతులు కారని అంటున్నారు. కాకపోతే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన మాసాన్ని బట్టి కొన్ని లక్షణాలు, వ్యవహార శైలి ఉంటుందని అంటున్నారు పండితులు. శ్రావణమాసంలో పుట్టినవారు కుటుంబం పట్ల మమకారం కలిగి ఉంటారని.. నిష్కల్మషంగా ఉంటారని చెబుతున్నారు పండితులు. దీని కారణంగా అందరు వీరిని ఇష్టపడతారట.

శ్రావణమాసంలో పుట్టినవారికి కొంతవరకు శివుడిని పోలి ఉంటారని.. వీరికి శివుడి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ మాసంలో పుట్టినవారు క్రీడా, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డవారు గొప్ప విజయాలు సాధిస్తారని.. శివుని అనుగ్రహం వల్ల వీరి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుందని అంటున్నారు పండితులు.ఈ మాసంలో పుట్టినవారు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారని.. ఎవరితోనైనా త్వరగా ప్రేమలో పడతారని అంటున్నారు పండితులు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.