తెలంగాణలోని ఈ జిల్లాలకు మరో 2 గంటల్లో వర్ష సూచన

తెలంగాణలోని ఈ జిల్లాలకు మరో 2 గంటల్లో వర్ష సూచన

హైదరాబాద్: తెలంగాణలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. మరో 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు వర్ష సూచన చేసింది. సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

హైదరాబాద్‌లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్​, నల్గొండ, యాదాద్రి, వనపర్తి, నారాయణపేట, మహబూబ్​నగర్​, జోగుళాంబ గద్వాల జిల్లాలో వర్షాలు పడ్డాయి.

అత్యధికంగా నల్గొండ జిల్లా యాచారంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కాంకోల్​లో 3.9 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా కేశంపేటలో 3.7, రంగారెడ్డి జిల్లా హయత్​నగర్లో 3.1, జగిత్యాల జిల్లా పొలాసలో 2.9, మంచిర్యాల జిల్లా తాండూరులో 2.7, నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 2.6, వనపర్తి జిల్లా గోపాలపేటలో 2.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్​ సిటీ వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షం పడింది.

ALSO READ : టికెట్ రేట్లు పెంచుకుంటే 20% వాటా ఇవ్వాల్సిందే

అత్యధికంగా హయత్​నగర్​లో 3.1 సెంటీమీటర్ల వర్షం పడింది. చంపాపేటలో 2.5, వనస్థలిపురంలో 2.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆగస్టులో అక్కడక్కడ చెదురుమదురు వానలు తప్ప.. చెప్పుకోదగిన స్థాయిలో పెద్ద వర్షాలేవీ పడలేదు. దీంతో వర్షపాతలోటు కూడా క్రమంగా పెరుగుతున్నది. వర్షపాత లోటు ఎక్కువున్న జిల్లాలు కూడా ఎక్కువవుతున్నాయి.