కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ళతో రాష్ట్రంలో పొలిటిక్ హీట్ పెరిగింది. గురుకులాల్లో రూ. రెండు వేల కోట్ల అవినీతి జరిగిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ విసిరిన సవాల్ పై గురువారం ( జులై 2 ) గన్ పార్క్ దగ్గర బైఠాయించారు మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ లు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గురుకులాల మొత్తం టెండర్లు కూడా రూ . రెండు వేల కోట్లు కూడా కావని అన్నారు. టెండర్ వచ్చిన కాంట్రాక్టర్ మాకేమైనా చుట్టమా అని ప్రశ్నించారు. కోన్ కిస్కా గొట్టం గాడు అడిగితే మేము జవాబు చెప్పమని అన్నారు పొన్నం.
గురుకులాల్లో రూ. రెండు వేల కోట్లు అవినీతి అంటూ మాట్లాడడానికి మీది నోరా? తాటి మట్టనా అని మండిపడ్డారు మంత్రి పొన్నం. టెండర్లలో అసలు అవినీతి జరిగింది రెండు వేల కోట్లా? 5వేల కోట్లా... ఆధారాలతో రండి మేము చర్చకు సిద్ధమని అన్నారు. మేము అవినీతి చేసినట్లు నిరూపిస్తే... ముగ్గురం మంత్రులం గన్ పార్క్ దగ్గర ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తామని అన్నారు.
మేము పిరికి పందలం కాదని..ఎవ్వడి తో బడితే వాడితో చర్చకు రామని అన్నారు. కేసీఆర్ వాళ్ళను అదుపులో పెట్టుకోవాలని..లేదంటే కేసీఆర్ కు చెడ్డపేరు వస్తదని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ ఒళ్ళు, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ అవినీతి చేసి ఉండచ్చని.. ప్రవీణ్ కుమార్ కు మా నిబద్దత తెలుసనీ అన్నారు. తాడు ,బొంగరం లేని ప్రవీణ్ కుమార్ కు మేము సమాధానం చెప్పమని... ఎవ్వడు పడితే వాడికి సమాధానం చెప్పం అని రాజ్యాంగం మీద ప్రమాణం చేశామని అన్నారు.
తమను గెలికి ప్రవీణ్ ఇబ్బంది పడొద్దని.. కోన్ కిస్కా గొట్టం గాడు అడిగితే మేము జవాబు చెప్పమని అన్నారు. ప్రజా స్వామ్యం లో దేవాలయం లాంటి అసెంబ్లీలో చర్చకు రావాలని.. మేము ప్రెస్ క్లబ్ కు కూడా వస్తామని అన్నారు. ప్రజా స్వామ్యంలో ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు 12 గంటల గన్ పార్కు దగ్గరకు రావాలని అన్నారు పొన్నం. మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు వస్తే ము ఎక్కడికైనా చర్చకు వస్తామని... నాలుగు ఏండ్లు మీలాగా కడప కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వలేదని..మేము పారదర్శకంగా టెండర్లు జరగాలని చూశామని అన్నారు.
