మహాభారతంలోని శక్తివంతమైన అంబ పాత్ర స్ఫూర్తితో ‘అంబ’s రివెంజ్’ సినిమా వస్తోంది. పురాణ గాథకు అత్యాధునిక ఏఐ సాంకేతికతను జోడించి జయవర్ధన్ మడి తెరకెక్కిస్తున్నారు. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఐ విజువల్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్‌ను 'కాలై విజువల్ స్టూడియోస్' అందిస్తోంది. తాజాగా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘టాలీవుడ్‌లో ఇదొక కొత్త ప్రయోగాత్మక అధ్యాయానికి నాంది. విజువల్ డిజైన్, పాత్రల రూపకల్పన, కథ రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించడం ద్వారా వినూత్న కథనాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఏఐ టెక్నాలజీతో వస్తున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్ ఇది. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తాం’ అని చెప్పారు.
