జ్యోతిష్యశాస్త్రం 12 రాశులు.. 27 నక్షత్రాలు.. నవగ్రహాల సంచారం ఆధారంగా రూపొందించారు. జన్మ తేది,, సమయాన్ని బట్టి జాతక చక్రాన్ని తయారు చేసిన పండితులు భవిష్యత్తును అంచనా వేసి చేయాల్సిన పరిహారాలను సూచిస్తారు. ఈ నెల ( జులై 2026)లో తులా రాశి వారికి ఎలా ఉంటుంది.. గ్రహాల బలం ఎంతమేరకు అనుకూలిస్తుంది.. మొదలగు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. . .!
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల (జులై నెల) తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. నెలలో మొదటి మరింత సానుకూలంగా, లాభదాయకంగా ఉంటుంది. చివరి 15 రోజులు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల తులారాశి వారు తమ ముఖ్యమైన పనులను నెల ప్రారంభంలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
తులా రాశి వారు వ్యక్తిగత జీవితంలో చాలా బాగుంటుంది.ఈ నెలంతా చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది దశమ స్థానంలో (కర్మ స్థానం) ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు మీకు సమాజంలో ఉన్నతమైన గుర్తింపును, ఉద్యోగంలో పదోన్నతులను ఇస్తూ మిమ్మల్ని అందనంత ఎత్తులో నిలబెడతాడు. శత్రు స్థానంలో ఉన్న శని మీ ప్రత్యర్థులను పటాపంచలు చేస్తాడు. కానీ మరోవైపు, అష్టమ స్థానంలో (8వ ఇల్లు) కుజుడు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, లేదా అకస్మాత్తు ఖర్చులు వచ్చి మనశ్శాంతిని లేకుండా పోతుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున చాలా అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
సమాజంలో పెద్దలతో, పలుకుబడి ఉన్న వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీరు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంలో సహాయపడటమే కాకుండా.. భవిష్యత్తులో లాభదాయకమైన వ్యాపారాలలో పాల్గొనడానికి అవకాశాలను కూడా అందిస్తుంది.
భాగ్య, దశమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యో గాల్లోనే కాకుండా, కుటుంబంలో కూడా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరగడంతో పాటు జీతభత్యాలు కూడా పెరుగుతాయి. ఉన్నత పదవి లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పిల్లలు విజ యాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు.
ఈ నెలలో తులా రాశి వారు చేయాల్సిన పరిహారాలు..
కుజ దోష శాంతి (అత్యంత ముఖ్యం): వాహన ప్రమాదాలు .. కుటుంబ కలహాలు జరగకుండా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి .. హనుమంతునికి సింధూరంతో అర్చన చేయండి. ఎర్ర కందిపప్పు దానం చేయండి.
కేతు పరిహారం: స్నేహితుల పట్ల నిర్లిప్తత, ఆత్మన్యూనత మరియు మానసిక ఒత్తిడి పోవడానికి ప్రతిరోజూ ఉదయం వినాయకుడికి గరిక సమర్పించి, "ఓం కేతవే నమః" అని జపించండి.
సూర్య ఆరాధన: వృత్తిలో గురువు మరియు సూర్యుని పూర్తి ప్రయోజనాలు పొందడానికి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం చదువుకోండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
