మనం తాగే పాలు సేఫేనా ? క్వాలిటీ టెస్టులో అముల్, మదర్ డైరీ, కంట్రీ డిలైట్ ఫెయిల్..

మనం తాగే పాలు సేఫేనా ? క్వాలిటీ టెస్టులో అముల్, మదర్ డైరీ, కంట్రీ డిలైట్  ఫెయిల్..

మనం ప్రతిరోజూ నమ్మకంతో కొనే అముల్, మదర్ డైరీ, కంట్రీ డిలైట్ వంటి పెద్ద కంపెనీల పాలల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు ట్రస్టిఫైడ్ (Trustified) అనే సంస్థ జరిపిన పరీక్షల్లో తేలింది. ప్రభుత్వం (FSSAI) నిర్ణయించిన ప్రమాణాల కంటే వీటిలో బ్యాక్టీరియా స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఈ రిపోర్ట్ చెబుతోంది.

పరీక్షల్లో తేలిన ఇవే:
మదర్ డైరీ: ఈ పాలల్లో ఉండాల్సిన దానికంటే 8 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా (TPC) ఉన్నట్లు గుర్తించారు.

కంట్రీ డిలైట్: "నేరుగా ఫామ్ నుండి మీ ఇంటికి" అని ప్రచారం చేసుకునే ఈ పాలల్లో కూడా ఉండాల్సిన దానికంటే రెండింతలు ఎక్కువ బ్యాక్టీరియా ఉంది.

అముల్: అముల్ తాజా, అముల్ గోల్డ్ పాలల్లో కోలిఫామ్ అనే బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

అముల్ పెరుగు: కేవలం పాలు మాత్రమే కాదు, అముల్ పెరుగులో కూడా వేల రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా  ఉన్నట్లు  పరీక్షల్లో బయటపడింది.

ఎగ్గోజ్ గుడ్లు (Eggoz): ఈ గుడ్లలో కూడా క్యాన్సర్‌కు కారణమయ్యే AOZ అనే నిషేధిత రసాయనం ఉన్నట్లు గుర్తించారు.

దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటి:
పాలల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే వాంతులు, విరేచనాలు వంటి జీర్ణకోశ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ఈ బ్యాక్టీరియా  తీవ్ర ప్రభావం చూపుతుంది. గుడ్లలో దొరికిన AOZ వంటి రసాయనాలు  క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి.

కంపెనీల వాదన:
అయితే, అమూల్ వంటి కంపెనీలు ఈ  టెస్టుల రిపోర్ట్ కొట్టిపారేశాయి. మేము  ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పాలను విక్రయిస్తున్నామని చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం (FSSAI) దీనిపై ఇంకా ఎటువంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.

మదర్ డైరీ 1974లో స్థాపించగా, కంట్రీ డిలైట్ 2015లో స్థాపించబడింది. కానీ అమూల్ 1948 నుండి ప్రారంభమైన భారతదేశ అత్యంత పురాతనమైనది. అమూల్ ప్రతిరోజు తాగే పాల ప్యాకెట్ మాత్రమే కాదు, ఇతర పాల ఉత్పత్తులను కూడా అందీస్తుంది. అయితే పెద్ద పెద్ద కంపెనీల పాలల్లోనే లోపాలు బయటపడటంతో, మన దేశంలో ఆహార నాణ్యత ప్రమాణాలు ఎంతవరకు అమలవుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.