జార్ఖండ్లో విద్యార్థులపై లాఠీఛార్జీ.. పోలీసు చర్యను తీవ్రంగా ఖండించిన సీజేపీ.

జార్ఖండ్లో విద్యార్థులపై లాఠీఛార్జీ.. పోలీసు చర్యను తీవ్రంగా ఖండించిన సీజేపీ.

జార్ఖండ్ పోలీసుల చర్చపై కాక్రోచ్ జనతాపార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తీవ్రంగా మండి పడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థి నాయకుడు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవేంద్ర నాథ్ మహతో కు సంఘీభావం ప్రకటించారు. 

మంగళవారం (ఆగస్టు 11) జార్ఖండ్ ఉద్యమకారులతో మాట్లాడిన దీప్కే.. ఆందోళనలు, ప్రభుత్వ వైఖరి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.  లాఠీఛార్జీలో మహతో గాయపడటంపై అభిజీత్ దీప్కే తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల హక్కులు సాధించుకునే క్రమంలో గత తొమ్మిది రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న విషయంతెలిసిందే. దీక్షలో ఉన్న మహతోను ఎలా లాఠీఛార్జీ చేస్తారని ప్రశ్నించారు. 

►ALSO READ | బెంగాల్ సీఎం సువేందు అధికారి హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

విద్యార్థి నాయకుడు మహతోతో వీడియో కాల్ మాట్లాడిన దీప్కే.. ఆయన ఆక్సిజన్ సపోర్ట్ తో చికిత్స పొందుతున్నాడని.. ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లాఠీ ఛార్జీ తర్వాత ఆరోగ్యం మరింత క్షిణించిదని చెప్పారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని హెచ్చరించారు. 

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), CGL పరీక్షలను పూర్తిగా రద్దు చేసి సీఐబీ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం చర్చలకు వచ్చినప్పటికీ.. విద్యార్థుల డిమాండ్ల విషయంలో కొన్ని డిమాండ్లను నెరవేర్చడం కుదరదని చెప్పడంతో మళ్లీ ఆందోళన బాటపట్టారు.