క్రికెట్‌కు బ్రేక్.. టీవీ హోస్ట్‌గా మారబోతున్న రోహిత్ శర్మ!

క్రికెట్‌కు బ్రేక్.. టీవీ హోస్ట్‌గా మారబోతున్న రోహిత్ శర్మ!

Rohit Sharma TV debut: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) క్రికెట్ మైదానంలోనే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనూ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. టీ20, టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్, త్వరలోనే రోహిత్ శర్మ షో (Rohit Sharma Show) ద్వారా బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను సోనీ టీవీ నెట్‌వర్క్ విడుదల చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  

గార్డెన్‌లో తిరగొద్దు ప్రోమో వైరల్: 
ఈ షోకు సంబంధించిన టీజర్లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. మ్యాచ్ జరిగే సమయంలో రోహిత్ "ఎవరూ గార్డెన్‌లో తిరగొద్దు" అనే ఫేమస్ డైలాగ్‌పై మొదటి ప్రోమోను రూపొందించగా, "రెండు లైన్లు మాట్లాడితేనే ఇంత వైరల్ చేశారు.. ఇక నా పూర్తి షో వస్తే ఎలా ఉంటుందో ఊహించండి" అంటూ హిట్ మ్యాన్ చెప్పిన డైలాగ్ అంచనాలను పెంచేసింది. కొత్తగా వచ్చిన వీడియోలో రోహిత్ కెమెరామెన్లకు, టెక్నికల్ క్రూ సభ్యులకు సూచనలు ఇస్తూ పూర్తి ప్రొఫెషనల్ డైరెక్టర్‌లా సందడి చేస్తూ కనిపిస్తున్నారు.

హోస్ట్‌గా రోహిత్.. కామెడీ టచ్‌తో కొత్త అవతారం!
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా సీఈఓ గౌరవ్ బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ షోలో రోహిత్ శర్మ యాంకర్ లేదా ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో కొనసాగే ఈ షో ద్వారా రోహిత్‌లోని సరికొత్త కోణాన్ని అభిమానులు చూడబోతున్నారు.

►ALSO READ | 2036 ఒలింపిక్స్ టార్గెట్.. జీవీ రాజా స్టేడియం అభివృద్ధిపై భారీ ప్లాన్: ఏకంగా రూ. 100 కోట్లతో

ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే రోహిత్: 
2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు, మే 2025లో టెస్టు ఫార్మాట్‌కు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్న హిట్ మ్యాన్, చివరిగా లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌పై 138 పరుగుల చారిత్రాత్మక సెంచరీతో రాణించారు. 2026 చివరి నాటికి భారత్ ఆడనున్న 11 వన్డేల్లో (వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లు) రోహిత్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.