Abhishek Porel Arrested: ఢిల్లీ క్యాపిటల్స్, బెంగాల్ వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (Abhishek Porel) వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడంటూ ఒక మెడికల్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా మొగ్రా పోలీసులు సోమవారం రాత్రి అతడిని అరెస్ట్ చేశారు. తమ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు లీక్ చేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించడంతో కోల్‌కతా హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేయగా, పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు.
3 ఏళ్ల రిలేషన్.. పెళ్లి పేరుతో మోసం:
కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థిని జూన్ 23వ తేదీన అభిషేక్ పోరెల్‌పై అధికారికంగా ఫిర్యాదు చేసింది. గత మూడేళ్లుగా తమ మధ్య సంబంధం ఉందని, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి తనను లొంగదీసుకున్నాడని ఆరోపించింది. కానీ, ఏడాదిన్నర క్రితం ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో తమ పర్సనల్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని పోరెల్ బెదిరించినట్లు బాధితురాలు కోల్‌కతా హైకోర్టుకి తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు, అతడిని తక్షణమే అరెస్ట్ చేయాలని బెంగాల్ పోలీసులను ఆదేశించింది.
BNS సెక్షన్ 69 కింద కేసు నమోదు:
కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో బెంగాల్ పోలీసులు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 69 (పెళ్లి చేసుకుంటామని మోసపూరిత వాగ్దానంతో శారీరక సంబంధం పెట్టుకోవడం)తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్ కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోరెల్‌కు చెందిన మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర స్టోరేజ్ డివైజులను పోలీసులు హస్తగతం చేసుకున్నారు.
రిషబ్ పంత్ రిప్లేస్‌మెంట్‌గా ఐపీఎల్ ఎంట్రీ:
లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన అభిషేక్ పోరెల్ గత రెండు సీజన్లుగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరపున కీలక ఆటగాడిగా మారాడు. రోడ్డు ప్రమాదం కారణంగా రిషబ్ పంత్ దూరమైన సమయంలో రీప్లేస్‌మెంట్‌గా వచ్చి, తన నిలకడైన ప్రదర్శనతో సత్తా చాటాడు. కాగా, తనపై వచ్చిన ఈ ఆరోపణలను పోరెల్ ఖండించినప్పటికీ, కోర్టు ఆదేశాల తర్వాత అతడి తరఫు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Bengal and Delhi Capitals wicketkeeper Abhishek Porel has been arrested in Hooghly over allegations of r@pe. The arrest comes following a complaint by a medical student.
— Rahul Rawat (@rawatrahul9) August 11, 2026
