Virat Kohli Fitness: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కేవలం ఆటలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఫిట్‌గా ఉన్న అథ్లెట్లలో ఒకడిగా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాడు. ఒకప్పుడు చోలే భటూరే, బటర్ చికెన్, స్వీట్లను ఇష్టంగా తినే బొద్దుగా ఉండే కుర్రాడి నుంచి ప్రపంచం మెచ్చే ఫిట్‌నెస్ ఐకాన్‌గా మారిన కోహ్లీ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రయాణం, అతడు పాటించే డైట్, వర్కౌట్ సీక్రెట్స్ ఏంటి అనేది ఇప్పుడు వీ6 తెలుగు వెబ్ సైట్ లో తెలుసుకుందాం.
టర్నింగ్ పాయింట్ ఇక్కడే:
తొలి ప్రపంచకప్ ముగిసిన తర్వాత తాను విపరీతమైన అన్‌ఫిట్‌గా ఉన్నానని, పొట్ట వేలాడుతుంటే అంతర్జాతీయ స్థాయిలో రాణించలేనని విరాట్ కోహ్లీ గ్రహించాడు. దాంతో ప్రాసెస్ చేసిన ఆహారానికి, జంక్ ఫుడ్‌కు స్వస్తి చెప్పి పూర్తి క్లీన్ వెజిటేరియన్ డైట్‌కు మారాడు. తాను ఇప్పటికి గతంలో ఆడినట్లే ఆడాలనే స్పష్టమైన లక్ష్యంతోనే కఠోరంగా శ్రమిస్తూ తన ఫిట్‌నెస్ ని కాపాడుకుంటున్నాడు.
రోజూ కోహ్లీ ఏం తింటాడు?:
* కోహ్లీ తన డైట్‌లో ప్రోటీన్లు, ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడతాడు.
* ఉదయం తినే ఆహారం: గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ (Gluten-free bread), నట్స్, సీడ్స్, హెల్తీ వెజిటెబుల్ డిషెస్.
* రాత్రి భోజనం: కండరాల బలానికి క్వినోవా (Quinoa), దోసెలు, పప్పు ధాన్యాలు, పాలకూర, సోయా, ప్రోటీన్ షేక్స్ తీసుకుంటాడు.
* డిటాక్స్ సీక్రెట్: మెటబాలిజాన్ని పెంచడానికి, శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడానికి నిమ్మరసంతో కలిపిన గ్రీన్‌టీని రోజుకు 3 నుంచి 4 కప్పులు తాగుతాడు. ఆహారంలో పంచదారను పూర్తిగా దూరం పెడతాడు.
జిమ్ షెడ్యూల్, వర్కౌట్ ప్లాన్:
* వారంలో 5,6 రోజులు జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ, ఒక్క రోజు మాత్రమే రెస్ట్ తీసుకుంటాడు విరాట్ కోహ్లీ.
* వెయిట్ ట్రైనింగ్, డెడ్‌లిఫ్ట్స్: శరీరంలో బలమైన కండరాలు (Lean Muscle), స్టామినా పెంచడానికి భారీ డెడ్‌లిఫ్ట్స్ చేస్తాడు.
* కార్డియో: లోయర్ బాడీ స్ట్రెంగ్త్, మైదానంలో వేగంగా పరుగెత్తే సామర్థ్యం కోసం హెవీ కార్డియో వ్యాయామాలు చేస్తాడు.
