వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు. ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ వంటి హిట్ల తర్వాత ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ థ్రిల్లర్ మూవీ ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేషన్
టీజర్ చూస్తుంటే ఇది పక్కా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా అర్థమవుతోంది. ఒక క్లిష్టమైన మర్డర్ కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా శ్రీవిష్ణు సీరియస్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తి కంటే, చంపిన వ్యక్తి ఆలోచనలను పట్టుకోవడం ముఖ్యం" అనే తరహాలో సాగే సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. టీజర్‌లో చూపించిన విజువల్స్, శ్రీవిష్ణు డైలాగ్ డెలివరీ సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేశాయి.
మరోసారి జంటగా..
ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరూ గతంలో ‘సామజవరగమన’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో వీరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించారు. ఇందులో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప శర్మ, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య వంటి వెటరన్,యంగ్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీవిష్ణు ఎప్పుడూ రొటీన్ సినిమాలకు భిన్నంగా వెళ్తుంటారు. ఈసారి ‘మృత్యుంజయ్’తో బాక్సాఫీస్ వద్ద మరో హిట్ కొట్టడతాడో లేదో చూడాలి.
Loved the way #MrithyunjayTeaser is crafted….. Feels like he’s chasing the truth.
— rajamouli ss (@ssrajamouli) February 11, 2026
Best wishes to Vishnu, Hussain and Sunny. Looking forward to Feb 27th.#Mrithyunjay
pic.twitter.com/jwd5RSIzGA
