బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) రీసెంట్ లుక్.. అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ముంబైలో జరిగిన SRA డేటా కలెక్షన్ అండ్ వెరిఫికేషన్ సపోర్ట్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైన సల్మాన్, గతంతో పోలిస్తే చాలా సన్నగా కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఉన్నట్టుండి భాయ్ బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో వీపరీతంగా చర్చనడిచింది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో వ్యక్తపరిచారు కానీ, అసలు కారణం మాత్రం రాబట్టలేకపోయారు. ఇక ఎట్టకేలకు సల్మాన్ ఖానే స్వయంగా ఈ విషయంపై స్పందించారు. వివరాల్లోకి వెళితే..
❤️ #Salmankhan @BeingSalmanKhan SALMAN KHAN pic.twitter.com/TkUFrdBf5f
— 👑 (@neelikhan786Skf) July 18, 2026
సల్మాన్ ఖాన్ తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు లేటెస్ట్గా ఓ షోలో ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఇటీవల సన్నగా కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా, తాను అనారోగ్యంతో కాదు.. ఫిట్‌నెస్ కోసం బరువు తగ్గానని వెల్లడించాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న రియాలిటీ షో అలియాన్స్ (Alliance)లో సల్మాన్ పాల్గొన్నారు.
ఈ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న తన సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) ను కలిసేందుకు వచ్చిన భాయిజాన్, తన ఫిట్‌నెస్ సీక్రెట్‌తో పాటు బరువు తగ్గడం వెనుక ఉన్న అసలు నిజాన్ని వెల్లడించాడు. అలా తన సోదరుడు సోహైల్ ఖాన్‌తో మాట్లాడుతూ తాను ఏకంగా 16 కిలోల బరువు తగ్గినట్లు తెలిపాడు. సోహైల్ కూడా 12 కేజీలు తగ్గినట్లు చెప్పగా, సల్మాన్ తన ట్రాన్స్‌ఫార్మేషన్‌ను రివీల్ చేశాడు. సల్మాన్ తన ఒక్క మాటతో.. ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ని పటాపంచాల్ చేసాడని ఫ్యాన్స్ వీడియో షేర్ చేస్తున్నారు.
" #SalmanKhan i've lost 16KG " and its all for Mega spectacle #SVC63.
— It’s Raj..!✨ (@TheLoyalSKFan) August 3, 2026
The last time he did a PEAK physique act was during Sultan.
From the bald look to chiseled physique, the vibes from this Vamshi starrer feel like some nostalgic EID bonanza. 🤞🏻
EID 2027 gonna be Insane🔥🔥 pic.twitter.com/ipBGs1qbRI
ఇక ఈ క్రమంలోనే, మరో ప్రశ్న మొదలైంది. ఇంతకీ సల్మాన్ బరువు తగ్గడానికి కారణం ఏంటని మరో డిస్కషన్ జరుగుతుంది. అయితే, భాయ్ బరువు తగ్గడానికి ముఖ్య కారణం డైరెక్టర్ వంశీ పైడిపల్లి మూవీ కోసం అని టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్కు పెద్దపీట వేస్తున్నారట వంశీ. ఈ నేపథ్యంలోనే భాయ్ బరువు తగ్గాలని సూచించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఒకేసారి 16 కేజీలు సల్మాన్ బరువు తగ్గడంతో సినిమా పట్ల తనకున్న డెడికేషన్ ఏంటో మరోసారి బయటకొచ్చింది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉండు.
సల్మాన్ లైన్-అప్..
మాతృభూమి (Maatrubhumi): ఫస్ట్ ఈ సినిమాను 'బ్యాటిల్ ఆఫ్ గాల్వన్' అనుకున్నారు, కానీ ఇప్పుడు స్టోరీ & టైటిల్ మార్చేసి ఫుల్ రీ-షూట్స్ చేస్తున్నారు. అపూర్వ లఖియా డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో సల్మాన్ ఇండియన్ ఆర్మీ కల్నల్ సంతోష్ క్యారెక్టర్ చేస్తున్నారు. చిత్రాంగద సింగ్ ఇందులో ఫీమేల్ లీడ్.
Eid 2027 బిగ్గెస్ట్ కొల్లాబ్: టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా సల్మాన్ ఖాన్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇది 2027 ఈద్ పండక్కి థియేటర్లలో రచ్చ చేయనుంది. ఇలా మరికొన్ని ప్రాజెక్ట్స్ లైనప్లో ఉన్నాయి. ఏదేమైనా భాయ్ హెల్త్‌పై వస్తున్న రూమర్స్ పక్కన పెడితే, నెక్స్ట్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర గట్టి కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు!
