సంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. ఓ మహిళ ఆమె కొడుకును హత్య చేసిన యువకుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామానికి చెందిన శివ, మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన చంద్రకళ గత కొంతకాలంగా కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జేపీ కాలనీలో లీవ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉంటున్నారు.
చంద్రకళకు ఇప్పటికై పెళ్లై ఒక కుమారుడు ఉన్నాడు. ఏమోందో తెలియదు కానీ బుధవారం (డిసెంబర్ 24) రాత్రి చంద్రకళ, ఆమె కుమారుడు రేవంత్ (14)ను శివ హత్య చేశాడు. అనంతరం తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శివను చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
►ALSO READ | షాకింగ్: ఐటీ మేనేజర్‌పై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్.. నిందితుల్లో సీఈఓ..
మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హత్యలకు గల కారణాలు ఆరా తీస్తున్నారు. శివరాజ్, చంద్రకళ తమను తాము భార్యాభర్తలుగా పరిచేయం చేసుకున్నారని స్థానికులు తెలిపారు. జంట హత్యలతో స్థానిక కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
