రాజ్యసభ ఎన్నికలు: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

రాజ్యసభ ఎన్నికలు: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికలల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల  తొలి విడత జాబితాను మంగళవారం  ప్రకటించింది.  తొలివిడతో  ఆరు రాష్ట్రాలనుంచి  మొత్తం 9 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబిన్​ బీహార్​ నుంచి పోటీ చేయనున్నారు. 

బీహార్​ నుంచి నితిన్​ నబిన్​, శివేష్​ కుమార్ లు బరిలోకి దిగుతుండగా.. అసోం నుంచి తేరాష్​ గోవాలా, జోనెక్​ మోహన లను నామినేట్ చేసింది. ఛత్తీస్​ గఢ్​ నుంఇ లక్ష్మీవర్మను అభ్యర్ధిగా ప్రకటించింది. 

►ALSO READ | ఖమేనీ మృతిపై మీ వైఖరేంటి..? మోదీ ప్రభుత్వ మౌనంపై సోనియా గాంధీ విమర్శలు

హర్యానానుంచి సంజయ్​ భాటియా, ఒడిశా నుంచి ఆ రాష్ట్ర చీఫ్​ మన్మోహన్​ సమల్​ తో పాటు సుజీత్​ కుమార్​ ను నామినేట చేశారు. ఇక పశ్చిమ బెంగాల్​ నుంచి రాహుల్​ నిన్హాను బరిలోకి దింపింది బీజేపీ.  తెలంగాణలో  రెండు రాజ్యసభ స్థానాలతో పాటు  ఇంకా 28 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి ఫిబ్రవరి 26న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఉపసంహరణకు మార్చి 9 చివరి తేదీ, 16న పోలింగ్ ఉంటుంది.