అమరావతిపై వైసీపీ విషం కక్కుతోంది: సీఎం చంద్రబాబు

అమరావతిపై వైసీపీ విషం కక్కుతోంది: సీఎం చంద్రబాబు

అమరావతిపై వైసీపీ విషం కక్కుతోందని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. బుధవారం ( జులై 1 ) నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం గంజాయి హబ్‌గా మారిందని అన్నారు. మూడు రాజధానుల పేరుతో జగన్ రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేశారని మండిపడ్డారు చంద్రబాబు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై అసభ్య పోస్టులు పెట్టారని... రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని అన్నారు చంద్రబాబు.'అమరావతి' అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు చంద్రబాబు.

►ALSO READ | ఏపీలో 18 నగరవనాలు వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

అమరావతిని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ నేతలకు రాజధాని గురించి మాట్లాడే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. రాష్ట్రానికి అమరావతి ఒకటే శాశ్వత రాజధాని అని.. దీనిని మార్చే ప్రసక్తే లేదని అన్నారు చంద్రబాబు.