ఏపీలో 18 నగరవనాలు వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

ఏపీలో 18 నగరవనాలు వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

ఏపీలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలను వర్చువల్ గా ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.బుధవారం ( జులై 1 ) మంగళగిరిలో క్యాంపు ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.నగరాలు, పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నగర వనాలు పట్టణాలకు గ్రీన్ లంగ్స్ లాగా పని చేస్తూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడతాయని అన్నారు.  

కేంద్ర ప్రభుత్వ ‘నగర వన యోజన’ నిధులతో పాటు స్థానిక నిధులను సమకూర్చుకుంటూ రూ. 36 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును సిద్ధం చేశామని అన్నారు. ఒక్కో నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో, రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించామని... కొడూరు, కైలాసగిరి, మదనపల్లెలలో ప్రత్యేకంగా ఎర్రచందనం పరిరక్షణ పార్కులను ఏర్పాటు చేశామని అన్నారు. 

ALSO READ : ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటే వ్యక్తిత్వ హననం కాదు.. 

మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయ జ్ఞానాన్ని చాటి చెప్పేలా, జీవవైవిధ్య పరిరక్షణే ధ్యేయంగా నక్షత్ర వనాలు, రాశి వనాలను అభివృద్ధి చేశామని... ఈ పార్కులు కేవలం పచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, ప్రజల శారీరక, మానసిక ఉల్లాసానికి కేంద్రాలుగా నిలవనున్నాయని అన్నారు పవన్ కళ్యాణ్. ఇందులో పక్షుల ఆవాసాలు, బోటింగ్, కయాకింగ్, ట్రెకింగ్ పాయింట్లు, యోగా కేంద్రాలు,  ఓపెన్ జిమ్‌లు వంటి ఎన్నో ప్రత్యేక ఆకర్షణలను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.