సోషల్ మీడియా దుర్వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బుధవారం ( జులై 1 ) ఈమేరకు ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్. వాక్ స్వాతంత్య్రం అంటే ఒకరిని కించపరచడం కాదని.. వాక్ స్వాతంత్య్రం దుర్వినియోగం మంచిది కాదని అన్నారు. ఒకరి హక్కుల్ని మరొకరు హరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. మత విశ్వాసాలను దెబ్బతీయడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని.. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వ్యక్తిత్వ హననం కాదని అన్నారు. మత విశ్వాసాలు దెబ్బతీస్తే శిక్షిస్తామని అన్నారు పవన్ కళ్యాణ్.
ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే హక్కును స్వాగతిస్తామని...ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సహించమని అన్నారు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, డెత్ థ్రెట్స్ చేస్తున్నారని... దేవుళ్ళు, దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. నిర్మాణాత్మక విమర్శలు స్వాగతిస్తామని..సైబర్ వేధింపులు, పరువు ప్రతిష్టలు తీయాలని అనుకోవడం సమంజసం కాదని అన్నారు.
►ALSO READ | వచ్చే ఎన్నికల్లో మావిగన్ Vs అమరావతి నినాదంతో జనంలోకి వెళతాం : వైఎస్ జగన్
నేరస్తులు, నేరాలకు కులం, మతం లేదని అన్నారు. సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులు పడుతున్నవారికి అండగా ఉంటామని అన్నారు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా దుర్వినియోగంపై పర్యవేక్షణ కోసం డిప్యూటీ సీఎం ఆఫీసులో ప్రత్యేక కార్యాలయం ఉంటుందని.. ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు పవన్ కళ్యాణ్.
