స్పీచ్ చదువుతూ స్టేజిపైనే కుప్పకూలిన మంత్రి ఆనం

స్పీచ్ చదువుతూ స్టేజిపైనే కుప్పకూలిన మంత్రి ఆనం

తిరుపతి జిల్లా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో కలకలం. జెండా పండుగకు హాజరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. వేదికపై తన ప్రసంగం చదువుతున్నారు. ఈ సమయంలోనే.. ఆయన ఉన్నట్లు ఉండి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చదువుతూ చదువుతూ.. ఒక్కసారిగా ఆయన తూలిపోయారు. వెనక్కి పడబోతుండగా.. ఆ పక్కనే ఉన్న సెక్యూరిటీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. మంత్రికి ఇలా జరగటంతో అధికారులు, వేడుకకు హాజరైన అందరూ కంగారు పడ్డారు. 

మంత్రి ఆనం కుప్పుకూలుతున్న సమయంలో ఆ పక్కనే ఉన్న కలెక్టర్ ఆయన్ను పట్టుకున్నారు. ఆ వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇవ్వాలంటూ సిబ్బందిని ఆదేశించారు. నిమిషాల్లోనే స్పాట్ కు చేరుకున్న డాక్టర్లు.. ఆయన్ను పరీక్షించారు. బీపీ డౌన్ కావటం వల్లే అలా జరిగిందని.. కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని.. ప్రమాదం లేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు డాక్టర్లు. 

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు డాక్టర్లు. ప్రస్తుతం బీపీ నార్మల్ గా ఉందని వెల్లడించారు. వ్యక్తిగత సిబ్బంది, అధికారుల అప్రమత్తతో ప్రమాదం తప్పినట్ల అయ్యింది. మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.