Sambarala Yeti Gattu: సంక్రాంతి బరిలో సాయిదుర్గ తేజ్.. 'సంబరాల ఏటి గట్టు' రిలీజ్ డేట్ ఫిక్స్!

Sambarala Yeti Gattu: సంక్రాంతి బరిలో సాయిదుర్గ తేజ్.. 'సంబరాల ఏటి గట్టు' రిలీజ్ డేట్ ఫిక్స్!

సాయిదుర్గ తేజ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'సంబరాల ఏటి గట్టు'కు ఎట్టకేలకు రిలీజ్ డేట్ వచ్చేసింది. వరుసగా వాయిదా పడుతూ వచ్చిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సాయిదుర్గ తేజ్‌ పవర్‌ఫుల్ లుక్‌తో కూడిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

డైరెక్టర్ రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సాయిదుర్గ తేజ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రంగా నిలవనుంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథకు భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో సాయిదుర్గ తేజ్ తన కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. పాత్ర కోసం ఆయన చేసిన లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పటికే ఆసక్తిని పెంచింది. ఇప్పటివరకు చూసిన లుక్స్‌కు పూర్తి భిన్నంగా కనిపిస్తూ.. సినిమాలో తన పాత్రపై క్యూరియాసిటీని పెంచుతున్నారు..

 

సాయిదుర్గ తేజ్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ టాప్ స్టార్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 'కాంతార' ఫేమ్ బి.అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండటం సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తోంది..

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటివరకు వాయిదాలతో అభిమానులను ఊరిస్తూ వచ్చిన 'సంబరాల ఏటి గట్టు'.. ఇప్పుడు సంక్రాంతి బరిలో ఏకంగా భారీ సినిమాలతో పోటీకి సిద్ధమవుతోంది. మరి సాయిదుర్గ తేజ్ ఈసారి ఎలాంటి బాక్సాఫీస్ సంబరాలు చేస్తాడో చూడాలి.