మువ్వన్నెల జెండా కింద మెరిసిన సినీ తారలు.. సోషల్ మీడియాలో దేశభక్తి సందేశాలు!

మువ్వన్నెల జెండా కింద మెరిసిన సినీ తారలు.. సోషల్ మీడియాలో దేశభక్తి సందేశాలు!

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మువ్వన్నెల జెండా రెపరెపలు, దేశభక్తి గీతాలు, జైహింద్ నినాదాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ప్రత్యేక సందర్భంలో సినీ తారలు కూడా సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ తమ దేశభక్తిని చాటుకున్నారు. 2026 ఆగస్టు 15న భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.. 

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. దేశ ప్రగతిలో ప్రతి పౌరుడి బాధ్యత కీలకమని పేర్కొంటూ.. రక్షణ రంగం బలోపేతం, ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతున్న తీరు వంటి అంశాలను ప్రస్తావించారు. రాజకీయ, సామాజిక భేదాలకు అతీతంగా యువత ముందుకు వచ్చి 'వికసిత్ భారత్' నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు..

 

మెగాస్టార్ చిరంజీవి సైతం స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ, భవిష్యత్ తరాలు గర్వపడేలా దేశాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. రామ్ చరణ్ భారతీయుడిగా ఉండటం గర్వంగా ఉందంటూ శుభాకాంక్షలు తెలిపారు.

 

ఎన్టీఆర్, కమల్ హాసన్ కూడా తమదైన శైలిలో దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఓ దేశమా.. నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా .. నేను నిన్ను గౌరవిస్తూనే ఉంటాను. భారతీయులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. 

 

ఇక నటి రకుల్ ప్రీత్ సింగ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుని మరింత ప్రత్యేకతను తీసుకొచ్చారు. ఆర్మీ కుటుంబంలో పెరిగిన తనకు ఆగస్టు 15 సాధారణ సెలవు కాదని, అదొక పెద్ద పండగ అని చెప్పారు. పాఠశాల రోజుల్లో దేశభక్తి గీతాల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్నని, దేశం కోసం పాట పాడటం ఎంతో గర్వంగా అనిపించేదని గుర్తుచేసుకున్నారు.

 

అటు పలువురు బాలీవుడ్ ప్రముఖలు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సినీ ప్రముఖుల సందేశాల్లో దేశభక్తితో పాటు ఐక్యత, బాధ్యత, భవిష్యత్ భారత్‌పై ఆశావహ దృక్పథం స్పష్టంగా కనిపించింది.

 

ఇలా తారల మాటల్లో వినిపించిన దేశభక్తి.. తెరపై కనిపించే హీరోయిజాన్ని మించి, ప్రతి భారతీయుడి బాధ్యతను గుర్తుచేస్తోంది. అటు అభిమానులు సైతం జైహింద్ అంటూ పోస్ట్ చేస్తున్నారు.