హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో ఘనంగా గవర్నర్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ తేనీటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజకీయ పార్టీల నేతలతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ వేడుకకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.
అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నుంచి ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ తో పాటు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు ఈ తేనీటి విందులో పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్. రామచందర్ రావు ఆత్మీయంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
