కోలీవుడ్ స్టార్ CM విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల దగ్గర కనిపించే హంగామా ఒక ఎత్తయితే.. సినిమాల్లో కనిపించిన ప్రదేశాలను వెతుక్కుంటూ అభిమానులు వెళ్లడం మరో ఎత్తు. ఇప్పుడు విజయ్ నటించిన ‘లియో’ సినిమాలో కనిపించిన కశ్మీర్‌లోని ఓ చిన్న కేఫ్ కూడా అభిమానులకు ప్రత్యేకమైన టూరిస్ట్ స్పాట్‌గా మారింది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘లియో’ 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ ‘పార్థిబన్’ అనే కేఫ్ ఓనర్‌గా కనిపిస్తాడు. కశ్మీర్‌లో చిత్రీకరించిన పలు కీలక సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందులో భాగంగా అనంత్‌నాగ్‌లోని సిఫార్ కేఫ్లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
25 రోజుల పాటు షూటింగ్..
కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మట్టన్ సమీపంలోని ఖనాబల్–పహల్గామ్ రోడ్డుపై ఈ సిఫార్ కేఫ్ ఉంది. పహల్గామ్‌కు సుమారు 40 కిలోమీటర్లు, శ్రీనగర్‌కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ‘లియో’ కోసం ఈ కేఫ్‌లో సుమారు 25 రోజుల పాటు షూటింగ్ జరిగినట్లు 2026లో వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. సినిమాలో మాత్రం ఈ కేఫ్ పేరు ‘వైల్డ్ బీన్స్’గా కనిపిస్తుంది. విజయ్‌తో పాటు త్రిష, సంజయ్ దత్ తదితరులు నటించిన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు.
విజయ్ అభిమానులకు ఫేవరెట్ స్పాట్
‘లియో’ విడుదలైన తర్వాత సిఫార్ కేఫ్‌కు ఊహించని స్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా తమిళనాడు, బెంగళూరు సహా దక్షిణ భారతదేశం నుంచి కశ్మీర్ వెళ్లే విజయ్ అభిమానులు ఈ కేఫ్‌ను తమ ట్రిప్‌లో తప్పనిసరిగా చేర్చుకుంటున్నారు. సినిమాలో విజయ్ కేఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చే సన్నివేశాన్ని కొందరు అభిమానులు అక్కడే రీక్రియేట్ చేస్తున్నారు. మరికొందరు విజయ్ జాకెట్ తీసే సన్నివేశం చిత్రీకరించిన ప్రదేశంలో నిలబడి ఫొటోలు దిగుతున్నారు. కేఫ్ సిబ్బంది కూడా విజయ్, ‘లియో’కు సంబంధించిన బ్యానర్లు, ఫొటోలు, థీమ్ మెటీరియల్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేఫ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
VIDEO | Kashmir cafe featured in Vijay’s ‘Leo’ becomes major tourist attraction in Jammu & Kashmir. Located in Anantnag district, the cafe featured in Thalapathy Vijay’s 2023 blockbuster Leo, draws fans who now visit to relive scenes from the film.
— Press Trust of India (@PTI_News) September 28, 2026
(Full video available on PTI… pic.twitter.com/1NY7VFvS9f
విజయ్ ఆర్డర్ చేసిన ఫుడ్‌కూ డిమాండ్
అభిమానులకు ఈ కేఫ్ కేవలం ఫొటోలు దిగే ప్రదేశంగా మాత్రమే మిగలలేదు. సినిమాలో విజయ్ ఆర్డర్ చేసినట్లు ప్రచారంలో ఉన్న హాట్ చాక్లెట్, ట్రౌట్ ఫిష్ను కూడా చాలామంది ప్రత్యేకంగా ఆర్డర్ చేస్తున్నారు. కేఫ్ మేనేజర్ సబ్జార్ అహ్మద్ లోన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘లియో’ విడుదలైన తర్వాత కశ్మీర్‌కు వచ్చే తమిళనాడు, ఇతర దక్షిణాది ప్రాంతాల పర్యాటకులు ముందుగా సిఫార్ కేఫ్ గురించి అడుగుతున్నారని చెప్పారు.
►ALSO READ | మనిషి శరీరాన్ని ముక్కలుగా నరికి.. నరనరాల్లో వణుకు పుట్టించేస్తున్న 'మయూఖ' ట్రైలర్!
అప్పటివరకు విజయ్ క్రేజ్ తెలియదట!
‘లియో’ షూటింగ్ సమయంలో విజయ్ తమ కేఫ్‌కు రావడం సిబ్బందికి పెద్దగా అసాధారణంగా అనిపించలేదట. షూటింగ్ సమయంలో విజయ్ ఎంతో సింపుల్‌గా ఉండేవారని, తమను పలకరిస్తూ వెళ్లేవారని కేఫ్ మేనేజర్ గుర్తుచేసుకున్నారు. అయితే సినిమా విడుదలైన తర్వాత విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తమకు అర్థమైందని ఆయన తెలిపారు. విజయ్ తమ కేఫ్‌లో షూటింగ్ చేయడం తమ వ్యాపారానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పారు.
‘సిఫార్’ అంటే ‘సున్నా’.. కానీ ఇప్పుడు మాత్రం!
ఈ కేఫ్ పేరులోనూ ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. ‘సిఫార్’ అనే ఉర్దూ పదానికి ‘సున్నా’ అనే అర్థం. ఒకప్పుడు సాధారణ రోడ్‌సైడ్ కేఫ్‌గా ఉన్న ఈ ప్రదేశం.. ‘లియో’లో విజయ్ కనిపించిన తర్వాత మాత్రం దక్షిణాది అభిమానుల కశ్మీర్ ట్రావెల్ లిస్ట్‌లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. స్థానిక డ్రైవర్లు, టూర్ ఆపరేటర్లు కూడా పహల్గామ్ వెళ్లే పర్యాటకుల ట్రిప్‌లో సిఫార్ కేఫ్‌ను చేర్చుతున్నట్లు సమాచారం.
అంటే.. ఒక సినిమా షూటింగ్ కోసం ఎంచుకున్న చిన్న కేఫ్, సినిమా విడుదలైన తర్వాత అభిమానుల సందర్శన స్థలంగా మారిపోయింది. విజయ్ అభిమానులకు కశ్మీర్ ట్రిప్ అంటే ఇప్పుడు ప్రకృతి అందాలతో పాటు ‘లియో’లో విజయ్ కనిపించిన సిఫార్ కేఫ్‌ను సందర్శించడం కూడా ఒక ప్రత్యేక అనుభూతిగా మారింది.
