భూములపై బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని  రూ.10 కోట్లు టోకరా

భూములపై బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని  రూ.10 కోట్లు టోకరా

భూములపై బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసగించిన ఓ అంతర్రాష్ట్ర కేటుగాడిని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడు నునావత్ యుగంధర్, తన నేరాలతో ఏకంగా 30 మందికి పైగా బాధితులను ముంచేశాడు. వీరి నుంచి సేల్ డీడ్‌లను సేకరించి, వాటిని దుర్వినియోగం చేస్తూ ఆస్తులను మూడో వ్యక్తులకు అక్రమంగా బదిలీ చేశాడు. అంతేకాకుండా, ఆ ఆస్తులను బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.1.50 కోట్లకు పైగా భారీ బ్యాంక్ లోన్ సైతం కాజేశాడు.

ఈ ఘరానా మోసగాడిపై ఇప్పటివరకు మొత్తంగా 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో 12 క్రిమినల్ కేసులు ఉండగా, 8 సివిల్ యాక్ట్ కేసులు ఉన్నాయి. సుమారు 10 కోట్ల రూపాయలకు పైగా ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

మరో 4 కేసుల్లో పరారీలో ఉన్న ఈ అంతర్రాష్ట్ర నిందితుడిని సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.