కొండచిలువ మటన్ షాపులోకి ఎంట్రీ ఇచ్చిన ఘటన తీవ్ర భయాందోళన, గందరగోళానికి గురిచేసింది. 2026 ఆగస్టు 15వ తేదీన.. సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మెల్లగా షాపులోకి ప్రవేశించింది పెద్దపాము. దీంతో.. అక్కడున్న వాళ్లంతా పరుగు తీయగా.. ఆతర్వాత జరిగిన సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో జరిగింది ఈ ఘటన. 15 ఫీట్ల పొడవున్న పెద్ద కొండచిలువ మటన్ షాపులోకి వెళ్లి మేకలను చూస్తూ ఆగిందట. అందులో ఏ మేకను మింగాలని చూస్తున్న క్రమంలోనే.. పామును చూసిన షాప్ ఓనర్ షాకయ్యి.. పెద్దగా కేకలు పెట్టాడు.
ఆ తర్వాత ఒకడొచ్చాడు.. సీన్ అంతా తనవైపు తిప్పుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న సురేష్ అనే వ్యక్తి సీన్ లోకి ఎంటరై.. చేసిన పని అక్కడున్నవాళ్లను షాకింగ్ కు.. భయానికి గురిచేసింది.
మేకను మింగేందుకు ప్లాన్ చేస్తున్న పాము దగ్గరికి ఏమాత్రం భయం లేకుండా వెళ్లి.. ఒక్కసారిగా పామును పట్టి లాగాడు. చేతికి బట్టనో, కవరో లేకుండా.. సేఫ్టీ లేకుండా ఆ పని చేయడం అక్కడున్న వారికి వణుకు పుట్టించింది. పామును పట్టి లాగడంతో అది అతడి చేతిని చుట్టుకుని ఒత్తిడి పెంచసాగింది.
రెండు మూడు సార్లు పాము సురేష్ చేతికి కొరికింది. అయినా వదలకుండా పట్టుకుని.. ఎట్టకేలకు పాముపై గ్రిప్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దండ వేసుకున్నట్లుగా మెడలో వేసుకున్నాడు. అందరి ముందు దానితో గేమ్స్ ఆడటం మొదలెట్టాడు. దీంతో అక్కడికి వందల సంఖ్యలో పబ్లిక్ చేరుకోవడంతో ఉద్రిక్తంగా మారింది.
అక్కడ చాలా సేపు పాముతో ఆడుకున్న సురేష్ ఆ తర్వాత ఓ పెద్ద డబ్బాలో పెట్టుకుని దాన్ని ఒక కాలువలో వదిలేశాడు. కాలువలో వదిలాక ఆ పాము అలారెండు మూడు సార్లు పైకి లేచి.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. మద్యం మత్తులో ఆ వ్యక్తి చేసిన పనికి ఒక సర్కస్ మాదిరిగా మారిపోయింది అక్కడి వాతావరణం.
