వచ్చే ఎన్నికల్లో మావిగన్ Vs అమరావతి నినాదంతో జనంలోకి వెళతాం : వైఎస్ జగన్

వచ్చే ఎన్నికల్లో మావిగన్ Vs అమరావతి  నినాదంతో జనంలోకి వెళతాం : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంపై మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. మా నినాదం.. మా విజన్.. మా విధానం మావిగన్ అని స్పష్టం చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కేంద్రంగా.. జాతీయ రహదారి మీదుగా ఏపీ రాజధానిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ విధానం అయిన అమరావతికి వ్యతిరేకం అని.. వచ్చే ఎన్నికల్లో రాజధాని మావిగన్ నినాదంతో జనంలోకి వెళతాం అని.. జనాన్ని ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు జగన్. 

2026, జులై ఒకటో తేదీన తాడేపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు జగన్. అమరావతిలో బాధిత రైతులను పరామర్శించటానికి వెళుతున్న వైసీపీ నేతలపై దాడి చేయటమే కాకుండా.. తిరిగి బాధితులపైనే కేసు పెట్టటం అనేది దుర్మార్గంగా అభివర్ణించారు జగన్. అమరావతి రాజధాని పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని.. వాళ్లకు అండగా.. వాళ్ల పిలుపు మేరకు వెళుతున్న వాళ్లపై దాడి చేశారని వివరించారు జగన్. 

రాజధాని అమరావతి పరిధిలోని.. అమరావతి కూడా రాజధానిలోకి వచ్చే విధంగానే మావిగన్ మాస్టర్ ప్లాన్ తోనే ముందుకు వెళతామని.. ఇదే విషయాన్ని జనానికి చెప్పి ఓట్లు అడుగుతామని.. జనం ఎవరికి ఓట్లు వేస్తారో.. జనం ఏం కోరుకుంటారో అప్పుడే తెలిసిపోతుందన్నారు జగన్. 

మావిగన్ కు మద్దతు ఇచ్చే వాళ్లు వైసీపీకి ఓటు వేస్తారు.. ఇదే విషయాన్ని వచ్చే ఎన్నికల్లో మా మ్యానిఫెస్టోలో కూడా పెడతామని.. ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో స్పష్టం అవుతుందన్నారు జగన్.