రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించేందుకు అన్ని ప్రాంతాల్లో మినరల్ మ్యాపింగ్ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్, అలాగే బంగారం వంటి విలువైన లోహాలు లభించే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. వెలికితీసే ఖనిజాలకు వ్యాల్యూ అడిషన్ చేసి రాష్ట్రంలోనే ప్రాసెసింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగి రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తుందని తెలిపారు.
APMDC ద్వారా విలువైన ఖనిజాలపై నిపుణులతో అధ్యయనం చేయాలన్నారు సీఎం. బీచ్ శాండ్, టైటానియం, ఇలమనైట్, మోనజైట్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యుమినియం వంటి ఖనిజాల విలువ పెంచే విధానంపై ప్రత్యేక పాలసీని పరిశీలించాలని ఆదేశించారు. ఏపీ, ఒడిశా, కేరళ రాష్ట్రాల రేర్ ఎర్త్ మినరల్స్‌కు క్లస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. జొన్నగిరి, చిగురుగుంట ప్రాంతాల్లో బంగారం నిల్వలపై కూడా మరింత అధ్యయనం చేయాలని చెప్పారు.
►ALSO READ | ఏపీ సచివాలయంలో అరుదైన సీన్...ఒకేరోజు 16మంది అధికారులు, ఉద్యోగులు రిటైర్మెంట్...
రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో కీలక ఖనిజాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అక్రమ తవ్వకాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు, శాటిలైట్ ఇమేజింగ్, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తున్నందున పారదర్శక సరఫరా వ్యవస్థను కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.
