రంగారెడ్డి: పోలీసుల కళ్లుగప్పి ఏపీలోనినుంచి తెలంగాణ మీదుగా పూణెకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో పెద్ద అంబర్ పేట్ పరిధిలోని ఓఆర్ ఆర్ వాహనాల తనిఖీలు నిర్వహించని పోలీసులు.. ఓ కారులో తరలిస్తున్న 102 కేజీల గంజాయిని పట్టు్కున్నారు. కారును సీజ్ చేసి, ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
బుధవారం (జూలై1) సాయంత్రం రంగారెడ్డి జిల్లాలో పెద్ద అంబర్ పేట్ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డుపై తనిఖీ చేశారుఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గంజాయి అక్రమరవాణాకు సంబంధించిన పక్కా సమాచారంతో ఓఆర్ ఆర్ పై వాహనాల తనిఖీలు చేసిన టాస్క్ ఫోర్స్ టీం.. ఏపీలోని ఏవోబీ నుంచి పూణెకు షిఫ్టు కారులో తరలిస్తున్న 102 కేజీల గంజాయిని బ్యాగులను సీజ్ చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. గంజాయి తరలిస్తున్నరాజేష్ సిర్సట్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
►ALSO READ | ఉప్పల్ మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లో తనిఖీలు.. నాన్ వెజ్ ఇలా స్టోర్ చేస్తే ఎలా తినేది..?
నిందితుడు ఏవోబీ ఆంధ్రా, ఒరిస్సా బార్డర్ నుంచి ఏపీ, తెలంగాణ మీదుగా పూణెకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్ ను ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ సి అండ్ డి సి ఐ లు వెంకటేశ్వర్లు నాగరాజు ఎస్సైలు సిబ్బంది కలిసి నిర్వహించారు. పట్టుకున్న గంజాయిని పెద్ద అంబర్పేట్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎస్టిఎఫ్ సిఐలు నాగరాజు, వెంకటేశ్వర్లు, ఎస్సై జ్యోతిలు తెలిపారు.
