- వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఇంగ్లాండ్
- అయ్యర్ సారథ్యంలో తొలి సిరీస్ నెగ్గాలని టీమిండియా పట్టుదల
లండన్: ఇండియా బుధవారం నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టీ–20 సిరీస్‌కు సిద్ధమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ సిరీస్‌లో భాగంగా నేడు చెస్టర్-లె-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ–20 సిరీస్‌లో 2–-0తో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ఈ సిరీస్ ద్వారా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. మరోవైపు, ఈ ఏడాది మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ‘ఐసీసీ మెన్స్ టీ–20 వరల్డ్ కప్ 2026’ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ ఆడుతున్న తొలి టీ–20 సిరీస్ ఇదే కావడం గమనార్హం. వరల్డ్ కప్ పరాజయానికి సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది.
పూర్తి జట్ల వివరాలు
ఇండియా స్క్వాడ్: శ్రేయస్ అయ్యార్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, సూర్యాంశ్ శెడ్గే, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
ఇంగ్లాండ్ స్క్వాడ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సన్నీ బేకర్, టామ్ బాంటన్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్ (వికెట్ కీపర్), సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
