- ఈనెల 31వరకు కాలేజీల్లో చేరేందుకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ లో అడ్మిషన్ల రెండో విడత షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈనెల 31వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష మంగళవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ జూన్ 30తో ముగిసింది. దీంతో మరో నెల రోజులు గడువు పెంచారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ సహా అన్ని రకాల జూనియర్ కాలేజీలు ఈ గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని, కేవలం టెన్త్ జీపీఏ ఆధారంగానే సీట్లు కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
