100 శాతం ఫిట్‌గా ఉన్న ప్లేయర్లనే ఆడించారా?.. భారత మహిళల జట్టుపై గవాస్కర్ ఫైర్

100 శాతం ఫిట్‌గా ఉన్న ప్లేయర్లనే ఆడించారా?.. భారత మహిళల జట్టుపై గవాస్కర్ ఫైర్

Sunil Gavaskar: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి భారత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డాడు. ఈ టోర్నీలో 100 శాతం ఫిట్‌గా ఉన్న ప్లేయర్లను భారత్ ఆడించిందా? లేదా? అనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చావో రేవో లాంటి కీలక మ్యాచ్‌లో ఓటమిపాలైన ఇండియా.. సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించడంపై అసహనం వ్యక్తం చేశాడు. 

సౌతాఫ్రికా మ్యాచ్‌లోనే బిగ్ మిస్టేక్:  
ఈ ఓటమిపై సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు.. కానీ, అంతకముందు జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాను టీమిండియా కచ్చితంగా ఓడించాల్సింది. ఆ మ్యాచ్‌లో మంచి స్థితిలో ఉండి కూడా పేలవమైన ఫీల్డింగ్ తో భారత్ ఓడిపోయింది.. నిజానికి ఆ మ్యాచ్‌తోనే భారత్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించిందని సన్నీ పేర్కొన్నాడు.

ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై గవాస్కర్ సందేహాలు: 
ప్రస్తుతం చాలామంది క్రికెట్ అభిమానులు అడుగుతున్న ప్రశ్ననే సునీల్ గవాస్కర్ కూడా లేవనెత్తాడు. మనం వంద శాతం ఫిట్‌గా ఉన్న ప్లేయర్లనే టోర్నీలో ఆడించామా? ఒకవేళ ఒక ప్లేయర్ పూర్తిగా ఫిట్‌గా లేకపోయినా, ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల ప్రతిభావంతులైతే వారిని ఆడించడం అర్థం చేసుకోదగినదే.. గాయపడిన ప్లేయర్ స్థానాన్ని భర్తీ చేయడానికి రిజర్వ్‌ బెంచ్‌లో ఉన్నవారు సరిపోరని అనుకునప్పుడు కూడా ఇలా చేయవచ్చు.. కానీ, టీమిండియా విషయంలో ఇలా జరిగి ఉంటుందని నేను అనుకోవట్లేదు.. కానీ, ప్లేయర్లు వేళ్లకు బ్యాండేజీలు వేసుకుని ఆడుతుంటే.. అది చిన్న గాయమైనా సరే, వారికి ఏదో పెద్ద గాయం ఉందనే భావన ఫ్యాన్స్ లో కలుగుతుందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. 

►ALSO READ | ఫిఫా ర్యాంకింగ్స్‌లో మెస్సీ రెండో స్థానం, ఎంబాప్పే మూడో ర్యాంక్.. ఫస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా!