FIFA Power Rankings: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభమవడంతో టోర్నమెంట్ చాలా ఆసక్తికరంగా మారింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ 3 మ్యాచ్‌ల్లో 6 గోల్స్ చేసి, వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధికంగా 19 గోల్స్ చేసిన ప్లేయర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు. కానీ, టోర్నీలో ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా ఫిఫా అధికారికంగా రిలీజ్ చేసిన పవర్ ర్యాంకింగ్స్ (Power Rankings)లో మాత్రం మెస్సీ, ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబార్పే, బ్రెజిల్ సంచలనం వినీషియస్ జూనియర్ వెనకబడి ఉన్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ జర్మనీకి చెందిన 29 ఏళ్ల స్ట్రైకర్ డెనిజ్ ఉండావ్ (Deniz Undav) పవర్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ అవుట్‌ఫీల్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.
టాప్-5 ప్లేయర్స్ పవర్ ర్యాంకింగ్స్:
ఫిఫా నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌లలో ప్లేయర్స్ ప్రదర్శన ఆధారంగా అటాకింగ్, క్రియేటివిటీ, డిఫెండింగ్ అనే మూడు కేటగిరీలలో 0– 10 పాయింట్ల మధ్య ఈ రేటింగ్ ఇస్తారు. టాప్ ప్లేయర్స్ ర్యాంకింగ్స్ వివరాలు ఇవే:
1. డెనిజ్ ఉండావ్ (జర్మనీ): అటాకింగ్, క్రియేటివిటీ కేటగిరీలలో అత్యుత్తమ పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు.
2. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా): గ్రూప్ స్టేజ్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
3. కిలియన్ ఎంబార్పే (ఫ్రాన్స్): తన ప్రతిభతో మూడో స్థానంలో నిలిచాడు.
4. వినీషియస్ జూనియర్ (బ్రెజిల్): అద్భుతమైన ఆటతీరుతో నాలుగో స్థానం దక్కించుకున్నాడు.
79. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్): ఈసారి రేటింగ్స్‌లో కాస్త వెనుకబడి 79వ స్థానంలో కొనసాగుతున్నాడు.
గ్లోబల్ స్టేజ్ వరకు ఉండావ్ ఎమోషనల్ జర్నీ:
విఎఫ్బీ స్టట్‌గార్ట్ క్లబ్‌కు ఆడే డెనిజ్ ఉండావ్ కేవలం జర్మనీ జట్టు కోసమే కాకుండా.. ప్రపంచ వేదికపై తన యజిది (Yazidi), కుర్దిష్ (Kurdish) మూలాలకు ప్రతినిధిగా నిలుస్తున్నాడు. ప్రపంచకప్‌లో సొంత జట్టుని ఏర్పాటు చేసుకునే ఛాన్స్ లేని ఈ రెండు అణగారిన వర్గాల ప్రజలు ఇప్పుడు ఉండావ్ సాధిస్తున్న విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా 2014లో ఇరాక్‌లోని సింజార్ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల చేతిలో ఘోరమైన అణచివేతకు గురైన యజిది శరణార్థుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ఈ డెనిజ్ ఉండావ్.
►ALSO READ | బెంగళూరుకు మకాం మార్చిన హార్దిక్ పాండ్యా.. ఎందుకంటే!
సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకొచ్చి:
గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చి, కేవలం తక్కువ సమయంలోనే 3 గోల్స్, 2 అసిస్ట్‌లతో జర్మనీ నాకౌట్ చేరడంలో కీ రోల్ పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనపై ఉండావ్ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు నా గురించి, మా ప్రజలు నా విజయాన్ని చూసి ఎంత గర్వపడుతున్నారో ఎప్పుడూ చెబుతుంటారు. మా సమాజం గర్వపడేలా చేయడానికి నాకు అవకాశం దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. సిరియాలోని యజిది గ్రామాల ప్రజలు సైతం ఉండావ్ ఆడే ప్రతి మ్యాచ్‌ను టీవీల్లో వీక్షిస్తున్నారు.
