చీఫ్ సెలెక్టర్‌‌‌‌ గా ప్రజ్ఞాన్‌‌‌‌ ఓజా..అగార్కర్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన హైదరాబాదీ

చీఫ్ సెలెక్టర్‌‌‌‌ గా ప్రజ్ఞాన్‌‌‌‌ ఓజా..అగార్కర్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన హైదరాబాదీ

బెంగళూరు: టీమిండియా మాజీ స్పిన్నర్‌‌‌‌, హైదరాబాదీ ప్రజ్ఞాన్‌‌‌‌ ఓజా.. మెన్స్‌‌‌‌ సీనియర్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌గా నియమితులయ్యాడు. సీనియారిటీ  ప్రతిపాదికన ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ వెల్లడించింది. ఇక మాజీ స్పిన్నర్‌‌‌‌ రమేశ్‌‌‌‌ పవార్‌‌‌‌.. సెలెక్షన్‌‌‌‌ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యాడు. సెలెక్టర్​గా అజిత్‌‌‌‌ అగార్కర్‌‌‌‌ పదవీకాలం ముగియడంతో అతని ప్లేస్‌‌‌‌లో పవార్‌‌‌‌ను తీసుకున్నారు. 

అశోక్‌‌‌‌ మల్హోత్రా, జతిన్‌‌‌‌ పరాంజపే సభ్యులుగా ఉన్న క్రికెట్‌‌‌‌ అడ్వైజరీ కమిటీ పవార్‌‌‌‌ నియామకాన్ని ఏకగ్రీవంగా సిఫారసు చేసిందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్‌‌‌‌ సైకియా వెల్లడించాడు. 48 ఏళ్ల పవార్‌‌‌‌ ఇండియా తరఫున 2 టెస్ట్‌‌‌‌లు, 31 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌, ముంబై, గుజరాత్‌‌‌‌ జట్లకు హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. బీసీసీఐ సెంటర్‌‌‌‌ ఆఫ్ ఎక్సలెన్‌‌‌‌లోనూ బౌలింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా సేవలందించాడు. శివసుందర్‌‌‌‌ దాస్‌‌‌‌, ఆర్‌‌‌‌పీ సింగ్‌‌‌‌, అజయ్‌‌‌‌ రాత్రా మిగతా సెలెక్టర్లుగా ఉన్నారు.