రేపే ఇంగ్లాండ్‌తో భారత్ ఢీ.. ఈ మ్యాచ్ ఎక్కడ చూడాలి, టైమింగ్స్ వివరాలు ఇవే!

రేపే ఇంగ్లాండ్‌తో భారత్ ఢీ.. ఈ మ్యాచ్ ఎక్కడ చూడాలి, టైమింగ్స్ వివరాలు ఇవే!

IND vs ENG: ఐర్లాండ్ చేతిలో క్లీన్‌స్వీప్ పరాభవాన్ని పక్కన పెట్టి, భారత యువ క్రికెట్ జట్టు మరో హై-వోల్టేజ్ సిరీస్‌కు రెడీ అయింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. రేపు (జూలై 1న) జరగబోయే తొలి టీ20 పోరుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని యంగ్ ఇండియా.. హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని పటిష్టమైన ఇంగ్లాండ్ తో పోటీ పడనుంది. ఇటీవల ఐర్లాండ్‌తో ఆడిన సిరీస్‌ని కోల్పోయిన భారత్‌కు, ఇప్పుడు ఇంగ్లాండ్ పై గెలవడం అత్యంత కీలకంగా మారింది.  

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య హోరాహోరీ పోరు: 
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇండియా చేతిలో 7  రన్స్ తేడాతో ఓటమి పాలైన ఇంగ్లీష్ టీమ్.. ఆ తర్వాత మరే ఇతర అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడలేదు.. దీంతో తమ స్వదేశీ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని, ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అటు టీమిండియా సైతం ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ విజయం సాధించి విమర్శకులకు సమాధానం చెప్పాలని చూస్తుంది. 

లైవ్ మ్యాచ్ ఏ ఛానెల్‌లో చూడాలంటే?: 
ఈ రసవత్తర పోరుని భారత్‌లోని క్రికెట్ ప్రేమికులు వీక్షించడానికి సోనీ నెట్‌వర్క్‌తో పాటు జియోహాట్‌స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్లుగా వ్యవహరిస్తున్నాయి. టీవీలో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు సోనీ స్పోర్ట్స్ (Sony Sports) ఛానెల్స్‌లో చూడోచ్చు.. డిజిటల్ లేదా మొబైల్ యూజర్లు జియోహాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్‌ను చూసే అవకాశం కల్పించింది.  

ఇరు జట్లు ఇవే: 
ఇండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్.

ALSO READ : కొడుకు కోసం ఆస్తులన్నీ అమ్మేసిన ఫుట్‌బాల్‌ ప్లేయర్..

ఇంగ్లాండ్: హ్యారీ బ్రూక్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జేమ్స్ కోల్, జోర్డాన్ కాక్స్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జోష్ టంగ, ల్యూక్ వుడ్.

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం): 
* 1st T20I: జూలై 1 – రివర్‌సైడ్ గ్రౌండ్ (చాస్టర్-లీ-స్ట్రీట్) – రాత్రి 10:00 గంటలకు..
* 2nd T20I: జూలై 4 – ఓల్డ్ ట్రాఫోర్డ్ (మాంచెస్టర్) – రాత్రి 7:00 గంటలకు..
* 3rd T20I: జూలై 7 – ట్రెంట్ బ్రిడ్జ్ (నాటింగ్‌హామ్) – రాత్రి 10:00 గంటలకు..
* 4th T20I: జూలై 9 – కౌంటీ గ్రౌండ్ (బ్రిస్టల్) – రాత్రి 10:00 గంటలకు.. 
* 5th T20I: జూలై 11 – ది రోజ్ బౌల్ (సౌతాంప్టన్) – రాత్రి 7:00 గంటలకు..