రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్

వానాకాలం సీజన్ కోసం రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  మంగళవారం (జూన్ 30) హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సదస్సులో నిధులు విడుదల చేశారు. తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల పంపిణీ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొదటి దశలో 2 ఎకరాల లోపు ఉన్న రైతుల అకౌంట్లో నిధులను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా అర్హులైన రైతులందరికీ దశలవారీగా ఈ పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు అకౌంట్లో ఎకరాకు 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే క్రమంలో.. తొలి విడత రెండు ఎకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల ఏశారు. 

తెలంగాణలో మొత్తం 73.32 లక్షల మంది రైతులకు ఈ సాయం అందనుంది.  మొదటి దశలో భాగంగా ఎకరాకు రూ. 6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు.  మొదటి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు. 

రైతు భరోసా ఆర్థిక సాయం కోసం కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తమ వివరాలను సమీప వ్యవసాయ విస్తరణ అధికారికి (AEO) జూలై 5వ తేదీలోపు అందజేయడం ద్వారా ఈ పథకానికి అర్హులు అవుతారు. నిధుల విడుదలపై పూర్తి వివరాలు, ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి అధికారిక పోర్టల్‌లను లేదా మీ గ్రామ వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు.