హైదరాబాద్: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్స్‌లో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి నుంచి 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారు బిస్కెట్‌తో పాటు నగదు చోరీకి గురైన ఘటనపై నమోదైన కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు ఇంటి పని మనుషులైన కొనాల రమ్య, కర్రి నాగలక్ష్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కేపీహెచ్‌బీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
