ఖమ్మం: అశ్వారావుపేట ఓ రైతు పొలంలో అశ్వారావుపేట పట్టణంలోని దొంతి కుంట చెరువు నుంచి మట్టి తోలుకునేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసి, లంచం తీసుకుంటూ ఉండగా ఇరిగేషన్ ఏ ఈ ఈ ఎల్. శ్రీనివాస్ ఏసీబీకి చిక్కాడు. అశ్వారావుపేటలో తన కార్యాలయంలో రైతు నుంచి 2 లక్షలు తీసుకుంటుండగా.. ఖమ్మం రేంజ్ ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్.. సదరు లంచగొండి ఇంజనీర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలో లంచగొండి ఉద్యోగులు రోజుకొకరు దొరికిపోతున్నారు.
ఇటీవలనే.. ఇంటి పర్మిషన్ కోసం రూ.25వేలు తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన వీరబాబు అనే వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణానికి పర్మిషన్కోసం పంచాయతీ సెక్రటరీ తమ్మిశెట్టి సురేశ్ను సంప్రదించాడు. బిల్డింగ్ పర్మిషన్ మంజూరు చేసేందుకు రూ.40 వేలు లంచంగా డిమాండ్ చేయగా రూ.25 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. కాగా లంచం ఇచ్చేందుకు ఇష్టపడని వీరబాబు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
►ALSO READ \ జిమ్కు వెళ్లొచ్చే లేడీసే టార్గెట్.. పరిచయం పెంచుకుని పెళ్లి దాకా.. నిత్య పెళ్లి కొడుకు మూడు పెళ్లిళ్ల ముచ్చట !
దీంతో ప్లాన్ ప్రకారం.. ఏసీబీ అధికారులు ముదిగొండలోని రైతు వేదిక సమీపంలో ఫిర్యాదుదారుని నుంచి రూ.25 వేలు తీసుకుంటుండగా పంచాయతీ సెక్రటరీ సురేశ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపారు.
